స్టార్స్ పై నోరు పారేసుకుని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన సెలబ్రిటీస్ వీరే !

ఎంత డబ్బు పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి నోరు జారితే అది తిరిగి మన దగ్గరికి రాదు.పైగా దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ ఆ విషయం తెలుసుకునే లోపే జరగాల్సిన పుణ్యకార్యం కాస్త జరిగిపోతుంది.

 Stars Who Lost Opportunuties Due To Temper Roja Vadivelu Hema Jamuna Vanisri Det-TeluguStop.com

అందుకే నోరుని అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది.నిజజీవితంలో అయినా సినిమా జీవితంలో అయినా చాలామంది ఈ నోరు జారీ ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్నారు.

దానివల్ల కెరియర్ లో వెనుక పడటం మాత్రమే కాదు అసలు లైమ్ లైట్ నుంచి కూడా పక్కకు వెళ్లిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి.మరి అలా నోరు జారి అవకాశాలు పోగొట్టుకున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Actors, Brahmanandam, Hema, Jamuna, Jayamalini, Rajinikanth, Roja, Shiva

మా అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన గొడవల కారణంగా హేమ( Hema ) అందరిపై నోరు పారేసుకుంది.దాని పర్యవసనాలు ఏంటి అనే విషయం ఆలోచించకుండా ఎంతమాట పడితే అంత మాట మాట్లాడేస్తుంది పైగా శివ బాలాజీ( Shiva Balaji ) చెయ్యి కూడా కొరికింది.చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.అలాగే ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి వారితో కూడా ఆమెకు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి.దానివల్ల ఆమె కెరియర్ పూర్తిగా నాశనం అయింది ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా కూడా లేదు.తమిళంలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది తన అభిమాన నటుడు రజినీకాంత్ సపోర్ట్ గా జయమాలిని పై సెటైర్స్ వేసిన కారణంగా ఇండస్ట్రీ మొత్తం వడివేలు( Vadivelu ) కొన్నాళ్లపాటు బహిష్కరించింది.

ఇక సీనియర్ ఆర్టిస్ట్ జమున( Jamuna ) కూడా అక్కినేని నాగేశ్వరరావు తో ఉన్న ఇష్యూస్ వల్ల ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు బ్యాన్ కి గురైంది.

Telugu Actors, Brahmanandam, Hema, Jamuna, Jayamalini, Rajinikanth, Roja, Shiva

తనపై చేయి వేశాడు అనే ఆరోపణ జమున చేయగా అది పొరపాటుగా తగిలింది అనేది అక్కినేని వారి వివరణ.ఇక మరో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ( Vanisri ) కూడా ఇంచుమించు ఇలాంటి తప్పులు చేసింది.అప్పుడే రిలీజ్ అయిన హీరోగా వచ్చిన దేవదాసు సినిమా పై నోరు పారేసుకోవడంతో విజయ నిర్మలకు కోపం వచ్చి కృష్ణతో వాణిశ్రీ నటించకుండా చివరి వరకు జాగ్రత్తగా పడింది.

కమల్ హాసన్ పై నోరు పారేసుకోవడంతో రోజా( Roja ) కూడా చాలా అవకాశాలు కోల్పోయింది.కమల్ హాసన్ సినిమా అంటే ముద్దులు, రొమాన్స్ తప్ప మరే ఉంటుంది అంటూ అలా మాట్లాడడంతో చాలా మంది ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube