సుజీత్ చేసిన తప్పు నాగ్ అశ్విన్ చేయడం లేదుగా.. అసలేం జరిగిందంటే?

ప్రభాస్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సాహో సినిమా( Saaho ) బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ గా నిలిచినా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.సుజీత్( Sujeeth ) చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

 Nag Ashwin Planning Plus For Kalki Movie Details, Director Nag Ashwin, Kalki Mov-TeluguStop.com

ఈ సినిమా లార్గో వించ్ సినిమాకు ఫ్రీమేక్ అని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే సుజీత్ చేసిన తప్పు నాగ్ అశ్విన్( Nag Ashwin ) చేయడం లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమా మరో నాలుగు వారాల్లో రిలీజ్ కానుంది.బుజ్జి పాత్ర ద్వారా నాగ్ అశ్విన్ సినిమాపై అంచనాలు అంచనాలు పెంచేస్తున్నారనే సంగతి తెలిసిందే.

సాహో సినిమాకు ముందు ఆ సినిమాలో చూపించిన సిటీ గురించి పూర్తి వివరాలతో చెప్పాలని నాగ్ అశ్విన్ భావించారని అయితే ఆ పబ్లిసిటీ సినిమాకు మైనస్ అవుతుందేమో అని భావించి వెనక్కు తగ్గారని సమాచారం.

అయితే నాగ్ అశ్విన్ మాత్రం కల్కి మూవీ ఎలా ఉండబోతుందో ఒక్కొక్క అప్ డేట్ ద్వారా క్లారిటీ ఇస్తూ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.ఈ విధంగా చేయడం ద్వారా కల్కి మూవీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సుజీత్ సైతం దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ తన ప్రతిభను చాటుకుంటున్న సంగతి తెలిసిందే.

నాగ్ అశ్విన్ కెరీర్ ప్లానింగ్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ మరో రాజమౌళి అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ అభిప్రాయం నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.నాగ్ అశ్విన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగ్ అశ్విన్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube