వీడియో వైరల్: కారును స్విమ్మింగ్ పూల్‌గా మార్చేసిన యువకులు.. ఎందుకంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వడగాల్పులతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Swimming Pool Made In Car Video Viral Details, Viral Video, Social Media, Car, S-TeluguStop.com

ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు( Temperature ) నమోదవుతున్నాయి.తాజాగా ఢిల్లీ నగరంలో 53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఇలా కేవలం భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రజలపై చూపిస్తున్నాడు.దీంతో ప్రజలు సూర్యుడి నుంచి తప్పించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

అయితే ఇందులో కొన్ని వీడియోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.తాజాగా ఇలాంటి ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో అసలు సంగతి ఏంటో చూస్తే.

వైరల్ అవుతున్న వీడియోలో కారుని స్విమ్మింగ్ పూల్ గా( Swimming Pool ) మార్చేశారు యువకులు.అంతేకాదు అలా నీళ్లతో నిండిన కారును( Car ) ఏకంగా రోడ్లపైకి తెచ్చి పరుగులు తీపిస్తున్నారు.ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ముందర కారు నడుపుతుండగా.ఇద్దరు వ్యక్తులు వెనుకల నీళ్లలో కూర్చొని ప్రయాణం చేస్తుంటారు.

ఇకపోతే కారు అడుగు భాగంలో ఓ మందం పాటి ప్లాస్టిక్ పత్తిని నీరు కిందకు పోనివ్వకుండా ఉండేలా అమర్చుకొని అందులో నీటిని ఏర్పాటు చేసుకున్నారు.ఆ తర్వాత అందులో వారు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.

వెనుకల కూర్చున్న వ్యక్తి తన సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారంది.వెనక సీట్ల కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనపడినట్టు వీడియోలో అర్థం అవుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొందరైతే బహుశా ఇదే కార్ పూలింగ్( Car Pooling ) అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే అసలు ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయి అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube