అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే స్పెల్లింగ్ బీ పోటీల్లో( Spelling Bee ) భారత సంతతి పిల్లలదే ఎప్పుడూ హవా.తాజాగా దానిని మరోసారి నిజం చేస్తూ ‘‘ 2024 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’’( 2024 Scripps National Spelling Bee ) పోటీల్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బాలుడు బృహత్ సోమా( Bruhat Soma ) విజయం సాధించాడు.
ఫ్లోరిడాకు చెందిన ఇతను ట్రైబ్రేకర్ రౌండ్లో 29 పదాలను కేవలం 90 సెకన్లలో ఎలాంటి తప్పుల్లేకుండా పలికి ఈ ఏడాది స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీలో విజయం సాధించారు.తద్వారా 40 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.41.64 లక్షలు) ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు.

ఇదే స్పెల్లింగ్ బీ పోటీలలో పాల్గొన్న బృహత్ 2022లో 163, 2023లో 74వ ర్యాంక్ సాధించాడు.ఈ పిల్లాడి తండ్రి మన తెలుగువాడే కావడం గర్వకారణం.బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమా ( Srinivas Soma ) స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా.( Nalgonda District ) వీరు కొన్నేళ్ల క్రితం ఫ్లోరిడాలో స్థిరపడ్డారు.
‘‘ The EW Scripps Company ’’ సీఈవో ఆడమ్ సింసన్ బృహత్‌కు ఛాంపియన్ ట్రోఫీని బహూకరించారు.ఇదే పోటీలలో టెక్సాస్‌లోని అలెన్‌కు చెందిన జాకీ రెండో స్థానంలో నిలిచి 25 వేల డాలర్లు గెలుచుకున్నాడు.కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగాకు చెందిన శ్రేయ్ పారిఖ్ మూడో స్థానంలో నిలిచి.12,500 డాలర్లు అందుకున్నాడు.అలాగే నార్త్ కరోలినాలోని అపెక్స్‌కు చెందిన అనన్య ప్రసన్న కూడా మూడో స్థానంలో నిలిచి 12,500 డాలర్లు అందుకుంది.

ఇకపోతే.‘‘ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’’ పోటీల్లోనూ భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్ షా విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఫైనల్లో “psammophile” అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి దేవ్ షా విజేతగా నిలిచి 50 వేల డాలర్ల బహుమతిని గెలుచుకున్నాడు.2022లోనూ స్పెల్లింగ్ బీ పోటీలలో విన్నర్, రన్నరప్ రెండూ ట్రోఫీలు భారతీయ చిన్నారులకే దక్కాయి.టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ (14) విజేతగా అవతరించింది.అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు(12) రెండో స్థానంలో నిలిచాడు.1925 నుంచి జరుగుతున్న స్పెల్లింగ్-బీ పోటీల్లో గత 20ఏళ్లుగా భారత సంతతి చిన్నారులే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.2020లో జరగాల్సిన స్పెల్లింగ్ బీ పోటీలు కరోనా ఉద్ధృతి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.







