తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల పేర్లు చెప్పమంటే మొదటి వరుసలో వినపడే పేర్లలో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ.( Superstar Krishna ) ఆయన తెలుగు సినీ చరిత్రలో అనేక రికార్డులు సృష్టించడమే కాకుండా ఓ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సేవలు అందించారు.
అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీని కూడా ఆయన పరిచయం చేశాడు.నేడు ఆయన జయంతి.
ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు కృష్ణను తలుచుకుంటూ ఆయనకు ఘనంగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు సోషల్ మీడియా వేదికగా.
ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ కొడుకైన సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కూడా సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు చేసిన పోస్టులో.“హ్యాపీ బర్త్డే నాన్న.మీరు ఎంతగానో మిస్ అవుతున్నారు., మరియు నా ప్రతి జ్ఞాపకంలో మీరు జీవించే ఉంటారు.” అంటూ మహేష్ తన తండ్రి పై ఉన్న ప్రేమను చెప్పకనే చెప్పుకొచ్చాడు.
దీంతో మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణకు జయంతి( Superstar Krishna Jayanthi ) శుభాకాంక్షలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతవరకు మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోడుతుంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.