వైరల్ వీడియో: కదులుతున్న కార్ స్టీరింగ్ వదిలేసి నడిరోడ్డుపై స్టెంట్స్.. పోలీసుల దెబ్బకి..

ఈమధ్య రోజుల్లో యువత చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి పిచ్చిపిచ్చి పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇంస్టాగ్రామ్ రీల్స్ అంటూ యువత ఏదైనా చేసేందుకు తాపత్రయపడుతున్నారు.

 Man Risky Stunt In Moving Car In Mumbai Viral Video Details, Viral Video, Social-TeluguStop.com

కొందరైతే వీటి కోసం వారి ప్రాణాలను రిస్కుచేయడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా రిస్క్ చేసేందుకు ఏమాత్రం సంకోచం చేయట్లేదు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం కనబడ్డాయి.

ఇలాంటి స్టెంట్స్ ( Stunts ) నేపథ్యంలో ఒక్కోసారి పోలీసులు కూడా హద్దుమీరి ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం ఈమధ్య గమనిస్తూనే ఉన్నాం.ఇకపోతే తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి ముంబై నగరంలో ( Mumbai ) చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ముంబై నగరంలోని ఓ ఫ్లై ఓవర్ పై ఓ వ్యక్తి కారు నడుపుతూ.డ్రైవింగ్ సీట్ లో నుంచి లేచి ఆ కదులుతున్న కారు( Car ) పైకి ఎక్కి స్టెంట్స్ చేశాడు.ఈ సమయంలో వ్యక్తి కారు పైన ఉండడంతో కారు ఎలాంటి డ్రైవర్ లేకుండానే రోడ్డుపై పరుగులు పెడుతుంది.

ఈ వీడియోలో మారుతి కార్ పై ( Maruti Car ) రాజస్థాన్ నెంబర్ ప్లేట్ కనబడింది.దీంతో నెంబర్ ప్లేట్ ఆధారంగా స్టెంట్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

దాంతో అతనిపై తగు చర్యలు తీసుకోబోతున్నారు ముంబై పోలీసులు.

ఇక వైరల్ గా మారిన ఈ వీడియో పై వీక్షకులు అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే ఆ వ్యక్తి యొక్క కారు లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయగా.మరికొందరైతే అతనిపై ఖచ్చితంగా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరైతే అతను తన ప్రాణాలతో పాటు వేరే వారి ప్రాణాలను కూడా ఇరకాటంలో పెట్టేసాడని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube