తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్స్ లో( Private Schools ) విద్యార్థులకు యూనిఫామ్, షూస్ అమ్మడంపై నిషేధం విధించింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని( Hyderabad ) స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ మరియు ఐసీఎస్ఈ సిలబస్ బోధించే అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.యూనిఫామ్స్, షూస్ తో పాటు బెల్టులు అమ్మడంపైనా కూడా నిషేధం విధించింది.
స్టేషనరీ, పుస్తకాలను మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ పై అమ్ముకునే అవకాశం కల్పించిందని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.