టీమిండియా T20 వరల్డ్ కప్ మ్యాచ్‌ పూర్తి షెడ్యూల్ ఇలా.. మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..

టి20 ప్రపంచకప్( T20 World Cup ) 9వ ఎడిషన్ జూన్ 2న టెక్సాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో మొదలు కాబోతోంది.ఈ మ్యాచ్లో కెనడాతో అమెరికా తలపడనుంది.2007లో మొదలైన మొదటి టి20 ప్రపంచ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన భారత్( India ) జూన్ 5న తన మొదటి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడబోతోంది.ఇక ఈ మెగా టోర్నమెంట్ కోసం అమెరికాలో( America ) మొత్తం మూడు వేదికలు కరీబియన్ దీవులలో 6 వేదికలను ఉపయోగించనున్నారు.

 T20 World Cup 2024 Team India Matches Full Schedule Details-TeluguStop.com

ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం 55 మ్యాచులలో 20 జట్లు పాల్గొనబోతున్నాయి.జూన్ 29న ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది.ఈ టోర్నమెంట్ లో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి.ఒక గ్రూపులో ఐదు టీమ్స్ ఉండనున్నాయి.

గ్రూప్ A లో అమెరికాతో పాటు టీమిండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్ లు ఉన్నాయి.

ఇక ఐసిసి టి20 వరల్డ్ కప్ 2024 భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించవచ్చు.ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మ్యాచులను ప్రసారం చేయనుంది.అలాగే డిస్నీ హాట్ స్టార్ లో కూడా మ్యాచులు చూడవచ్చు.

ఇక టీమిండియా మ్యాచ్ లు భారత కాలమన ప్రకారం ఏ రోజు ఎక్కడ ఆడబోతున్నారన్న వివరాలు చూస్తే.

జూన్ 5: భారతదేశం – ఐర్లాండ్ మ్యాచ్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ లో 8:00 PM (IST) కు చూడవచ్చు.

జూన్ 9: భారత్ – పాకిస్థాన్: ( India vs Pakistan ) నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ లో 8:00 PM (IST) కు చూడవచ్చు.

జూన్ 12: భారతదేశం – USA: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ లో 8:00 PM (IST) కు చూడవచ్చు.

జూన్ 15: ఇండియా – కెనడా: సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా లో రాత్రి 8:00 (IST) కు చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube