ఏపీ ఎన్నికలు( AP Elections ) ముగిసిన అనంతరం మే 17వ తారీకు సీఎం జగన్( CM Jagan ) కుటుంబంతో విదేశాలకు వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో లండన్( London ) పర్యటన ముగించుకుని జూన్ మొదటి తారీకు ఉదయం నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు.
ఆల్రెడీ శుక్రవారం సాయంత్రం లండన్ నుండి బయలుదేరడం జరిగింది.దీంతో రేపు ఉదయం 4 గంటలకు సీఎం జగన్ గన్నవరానికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకోనున్నారు.
కాగా రేపు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎమ్మెల్యేలు, మంత్రులను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.ఇదే సమయంలో నాయకుల పనితీరుపై సర్వేలు( Survey ) చేసుకుని వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది.2019 కంటే ఈసారి ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎన్నికల ప్రచారంలో సైతం తన ఐదేళ్ల పాలన నచ్చితేనే ఓటేయండి అని ప్రసంగాలు చేయడం జరిగింది.పూర్తిగా తన ఐదేళ్ల పాలన ఆధారం చేసుకుని ఈ ఎన్నికలను వైయస్ జగన్ ఎదుర్కోవడం జరిగింది.
జూన్ 4న ఫలితాలు రాబోతున్న తరుణంలో రేపు జగన్ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు గ్రాండ్ గా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.