రెండేళ్ల బాలుడు గీసిన ఈ పెయింటింగ్ ఎన్ని లక్షలకు అమ్ముడైందో తెలిస్తే..??

జర్మనీకి చెందిన రెండేళ్ల బాలుడు లారెంట్ ష్వార్జ్ ( Laurent Schwarz)తన రంగురంగుల జంతువుల చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.ఈ చిన్నారి గీసిన చిత్రాలకు ఏకంగా 7,000 డాలర్ల (దాదాపు రూ.5,83,000) వరకు చెల్లించడానికి కూడా కొందరు సిద్ధంగా ఉన్నారు.ఒకరు అంత అమౌంట్ పెట్టి ఇతడు గీసిన ఒక పెయింటింగ్ ను కొనుగోలు చేశారు.

 If You Know How Many Lakhs This Painting Drawn By A Two Year Old Boy Was Sold,-TeluguStop.com

లారెంట్ కుటుంబంతో ఒక హాలిడే ట్రిప్‌కు వెళ్లినప్పుడు చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకుని పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు.ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు అతనికి పెయింటింగ్స్ చేసుకోవడానికి ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు.

లారెంట్ చిత్రాలు చాలా ప్రత్యేకమైనవి.ఎందుకంటే, అవి ఆకారాలు, రంగులను అద్భుతంగా మిళితం చేస్తాయి.

అయినప్పటికీ, అవి ఏ జంతువుల చిత్రాలు అనేది స్పష్టంగా తెలుస్తుంది.ఏనుగులు, డైనోసార్లు, గుర్రాలు లాంటి జంతువుల చిత్రాలను అతను చాలా ఇష్టంగా చిత్రిస్తాడు.

ముఖ్యంగా ఏనుగుల చిత్రాలను( Elephants Pictures ) చిత్రించడంలో అతనికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది.ఈ పిల్లోడు ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించడానికి ఇష్టపడతాడు.

బోరింగ్ కలర్స్‌ అసహ్యించుకుంటాడు.వయసు చిన్నదే అయినా ఏ రంగులను కలిపి ఉపయోగించాలో చాలా బాగా తెలుసు.

అద్భుతమైన పెయింటింగ్ స్కిల్ ఉన్న లారెంట్ ష్వార్జ్ ను చూసి తల్లి బాగా గర్విస్తోంది.అతని చిత్రాలను చూసిన ఫిదా అయిపోయిన తల్లి లీజా, తన బిడ్డ కళా ప్రతిభను ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకుంది.ఈ లక్ష్యంతో, ఆమె అతని కోసం ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించింది.చాలా త్వరగానే, లారెంట్ చిత్రాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.అతని అకౌంట్‌కు 29,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు.

ఈ బాలుడి పెయింటింగ్స్‌కు మంచి గిరాకీ రావడంతో, లీజా ఆన్‌లైన్‌లో వాటిని విక్రయించడం ప్రారంభించింది.లారెంట్ పెయింటింగ్స్ మ్యూనిచ్‌లో జరిగిన ART MUC అనే అతిపెద్ద కళా ప్రదర్శనలో కూడా చూపించారు.అక్కడ కూడా అవి అందరినీ ఆకట్టుకున్నాయి.

లారెంట్ పెయింటింగ్స్ అమ్ముడుపోతున్నప్పటికీ, అతనికి ఇష్టమైనప్పుడల్లా చిత్రించే స్వేచ్ఛ ఉండేలా తల్లి జాగ్రత్త వహిస్తుంది.కొన్నిసార్లు అతను బ్రేక్ తీసుకొని, చిత్రించడం మానేస్తాడు.

మ్యూనిచ్‌లో జరిగిన కళా ప్రదర్శనలో వేలాది చిత్రాల మధ్య లారెంట్ రెండు చిత్రాలు ప్రదర్శించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube