ఏపీ ఎన్నికల ఫలితాలు( AP Elections Results ) జూన్ 4వ తారీఖు రాబోతున్నాయి.జూన్ మొదటి తారీకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రజా తీర్పు ఉంటుందని మేధావులు అంటున్నారు.
ఈ క్రమంలో ఆంధ్ర ఓటర్ నాడిని పట్టుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు.జనాలు ఎవరికి ఓటు వేశారు అన్నది.
స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన ప్రధానంగా వైసీపీ.
టీడీపీ కూటమి మధ్య పోటీ ఉంది.ఈసారి పోలింగ్ 80 శాతానికి పైగానే పెరగటంతో… ఎవరికి వారు తామే గెలుస్తామని వైసీపీ మరియు తెలుగుదేశం నేతలు అంటున్నారు.
కాగా ఫలితాలు వెలువడే సమయం రావడంతో ఎలక్షన్ అనంతరం విదేశాలకు వెళ్లిన నాయకులంతా రాష్ట్రానికి చేరుకుంటున్నారు.బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) విదేశాల నుండి హైదరాబాద్ కి రావడం జరిగింది.ఈ క్రమంలో హైదరాబాదులో( Hyderabad ) ఉంటూ ఎన్నికల ఫలితాల సమయంలో నాయకులు ఏ రకంగా వ్యవహరించాలి అన్న దానిపై దిశా నిర్దేశం చేస్తున్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్ లో శుక్రవారం చంద్రబాబుని కొంతమంది తెలుగుదేశం నాయకులు( TDP Leaders ) కలవడం జరిగింది.
చిన్న రాజప్ప, అఖిలప్రియ, చింతమనేని ప్రభాకర్, నాగుల్ మీరా, రామాంజనేయులు సహా పలువురు బేటి కావటం జరిగింది.ఎన్నికలు జరిగిన తీరు, కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.
కాగా రేపు చంద్రబాబు అమరావతికి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.