కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్( Karnataka Deputy CM DK Shivakumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య( Siddaramaiah )తో పాటు తనకు వ్యతిరేకంగా కొందరు యాగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంతో పాటు తమకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ‘ శత్రు భైరవి’ పేరిట యాగం చేస్తున్నారని డీకే ఆరోపించారు.ఈ మేరకు కేరళలోని ఏకాంత ప్రదేశంలో అఘోరీలు, తాంత్రికులు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా 21 మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు మరియు ఐదు పందులను బలి ఇస్తున్నారన్నారు.కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే కిందరు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
అదేవిధంగా కర్ణాటకలో నిమ్మకాయల నిపుణులెవరో అందరికీ తెలుసన్నారు.అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తనను దేవుడే రక్షిస్తారని తెలిపారు.
కాగా ప్రస్తుతం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.