విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ సాధించారా?

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్( Viswak sen ) హీరోగా న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి ( Neha Shetty )హీరోయిన్ గా నటించింది.

 Vishwak Sen Gangs Godavari Movie Twitter Review, Viswak Sen, Gangs Godavari Movi-TeluguStop.com

అలాగే హీరోయిన్ అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టించగా యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందించారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు.

చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాల‌య్య రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

Telugu Gangs Godavari, Godavari Review, Neha Shetty, Tollywood, Review, Viswak S

ఇప్పటికే ఈ సినిమా( Gangs of Godavari )కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ట్విట్టర్ రివ్యూ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఇందులో యాక్ష‌న్‌, కామెడీ మిక్స్ చేసి లంక‌ల‌ ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుంద‌ని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.విశ్వ‌క్‌ లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన సినిమా ఇద‌ని అంటున్నారు.

స్క్రీన్‌ప్లేతో ల్యాగ్ లేకుండా సినిమాని తీశారని మెచ్చుకుంటున్నారు.రా అండ్ ర‌స్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌, మాస్ డైలాగ్స్ బాగున్నాయ‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

సినిమా బోర్ కొట్ట‌నప్పటికీ డైరెక్ష‌న్ ఔట్‌డేటెడ్‌గా ఉందని అంటున్నారు.

Telugu Gangs Godavari, Godavari Review, Neha Shetty, Tollywood, Review, Viswak S

విశ్వ‌క్‌సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువ‌గా లేక‌పోవ‌డం మైన‌స్‌ అయిందని చెబుతున్నారు.డ్రామా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని చెబుతోన్నారు.డైలాగ్స్ బాగున్నాయ‌ని ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌లెంట్ అని, సెకండ్ హాఫ్ బాగుందని ఒక‌రు ట్వీట్ చేశారు.క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube