తెలంగాణ దశాబ్ద ఆవిర్భావ వేడుకలను( Telangana Decade Celebrations ) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ( KCR ) ఆహ్వానించాలని భావిస్తోంది.
ఈ క్రమంలో కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను ప్రొటోకాల్ ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ కు( KC Venugopal ) అప్పగించిందని తెలుస్తోంది.ఇందులో భాగంగా కేసీఆర్ అపాయింటుమెంట్ కోసం కేసీ వేణుగోపాల్ ప్రయత్నిస్తున్నారు.
అయితే కేసీఆర్ హైదరాబాద్ వచ్చిన తరువాత అపాయింట్ మెంట్ ఇస్తారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారని సమాచారం.కేసీఆర్ కలిసేందుకు అనుమతి ఇవ్వగానే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇన్వైట్ చేస్తూ ఆహ్వానపత్రికను అందిస్తామని కేసీ స్పష్టం చేశారు.