బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లుగా సోషల్ మీడియా స్టార్స్.. వైరల్ అవుతున్న న్యూస్?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని బిజీగా గడుపుతున్నారు.

 Bigg Boss Season 8 Telugu Contestants Details,bigg Boss, Youtube Stars,nagarjuna-TeluguStop.com

ఇక ఇటీవల సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో మంచి విజయం అందుకోవడంతో సీజన్ 8( Season 8 ) ప్రారంభానికి కూడా కసరత్తులు మొదలయ్యాయి.ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది.

ఇకపోతే సీజన్ సెవెన్ కంటే మరింత వినోదాత్మకంగా  సీజన్ 8 ఉండాలని మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సీజన్లో సీజన్ సెవెన్ లో పాల్గొన్నటువంటి వారు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా నయని పావని( Nayani Pavani ) ఈ సీజన్ 8లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసారని సమాచారం.ఈమె గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు.

అయితే మరొక కంటెస్టెంట్ ను సేవ్ చేసే క్రమంలో తనని వారానికి ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది.దీంతో ఈమెను తిరిగి మరోసారి ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

ఇక ఈమెతోపాటు మరి కొంతమంది యూట్యూబ్ స్టార్స్( Youtube Stars ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం అందులో భాగంగా కీరాక్ ఆర్పీ,( Kiraak RP ) బుల్లెట్ భాస్కర్,( Bullet Bhaskar ) అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, బర్రెలక్క, రీతు చౌదరి, సోనియా సింగ్, యాంకర్ నిఖిల్, వంశీ వంటి వారందరూ కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.మరి వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమానికి కూడా హోస్ట్ గా నాగార్జున( Nagarjuna )వ్యవహరించనున్నారు.అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube