ఈ నటులను తమ సినిమా కోసం ఒప్పించడానికి దర్శకులు ఎంతో ఇబ్బంది పడ్డారట !

ఎవరికైనా పిలిచే సినిమా అవకాశం ఇస్తే నో అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు.పైగా ఒక స్టార్ హీరో సినిమాలో లేదంటే పెద్ద చిత్రంలో నటించాలి అంటే అదృష్టం ఉండాలి అని భావిస్తారు ప్రతి ఒక్కరు.

 Tollywood Directors Faced Problems With These Actors Ajay Ghosh Nagarjuna Sobhan-TeluguStop.com

కానీ ఇప్పుడు మనం చెప్పుకో ఏ ఆర్టిస్టులు అలా కాదు.వారికి ఎంతో గొప్ప అవకాశం వచ్చినా కూడా వారిని ఒప్పించడానికి ఈ సదరు సినిమా డైరెక్టర్స్ కి తల ప్రాణం తోకలోకి వచ్చిందంట.

అంతలా కన్విన్స్ చేస్తే తప్ప కొంత మంది ఒప్పుకుంటారు మరి కొంతమంది ఒప్పుకోరు.మరి అలా ఒక పాత్ర కోసం కొంతమంది నటులను డైరెక్టర్స్ ఎంతగానో ఒప్పించి సినిమాలో నటింప చేయించారట.ఇంతకీ ఆ సినిమాలు ఏంటి ఆ ఆర్టిస్టులు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శోభన్ బాబు

Telugu Ajay Ghosh, Annamayya, Athadu, Sukumar, Trivikram, Nagarjuna, Pushpa, Rag

హీరోగా ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు( Sobhan Babu ) కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు కానీ ఒక దశ తరువాత ఆయన సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు.ఆయన ముసలి అవతారంలో బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదు.అందుకే ఆయనను మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో( Athadu Movie ) నాజర్ పోషించిన పాత్రలో నటింపజేయాలని త్రివిక్రమ్( Trivikram ) ఎంతగానో ప్రయత్నించారట.ఆయన ఎంత నచ్చజెప్పడానికి చూసినా కూడా శోభన్ బాబు ఒప్పుకోలేదట.

నాగార్జున

Telugu Ajay Ghosh, Annamayya, Athadu, Sukumar, Trivikram, Nagarjuna, Pushpa, Rag

నిన్నే పెళ్ళాడుతా సినిమా( Ninne Pelladatha ) నాగార్జున( Nagarjuna ) కెరీర్ లోనే ఆల్ టైం ఫేవరెట్ మూవీగా ఉంటుంది.ఈ సినిమా అందించిన విజయం తర్వాత ఎవరైనా కూడా మళ్లీ ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నాగార్జున కనిపిస్తాడు అని అనుకుంటారు.కానీ ఎవరు ఊహించని విధంగా అన్నమయ్య సినిమాతో( Annamayya Movie ) తెలుగు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యే సినిమా తీశారు నాగార్జున.

అయితే నాగార్జునను ఈ సినిమా కోసం ఒప్పించడానికి రాఘవేంద్రరావు గారికి( Raghavendra Rao ) కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాట.నాగార్జున అన్నమయ్య సినిమాలో నటించడానికి అస్సలు ఒప్పుకోలేదట.తనను ఎవరు అలా డివోషనల్ పాత్రలో చూడరు అని చెప్తే రాఘవేంద్రరావు ఎంతో కన్విన్స్ చేసి నాగార్జునను ఆ పాత్రలో నటింపచేస్తే అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం కల్లారా చూసాం.

అజయ్ ఘోష్

Telugu Ajay Ghosh, Annamayya, Athadu, Sukumar, Trivikram, Nagarjuna, Pushpa, Rag

కరోనా తో ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోయిన అజయ్ ఘోష్( Ajay Ghosh ) పీరియడ్ తర్వాత పుష్ప సినిమాలో( Pushpa ) నటించాల్సి ఉంది.అయితే బ్రతికుంటే చాలు ఇక సినిమాల్లో నటించను అంటూ అజయ్ ఎంతగానో చెప్పి చూశారట.కానీ సుకుమార్( Sukumar ) ఫోన్ చేసి ఎంతో రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక పుష్ప చిత్రంలో నటించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube