పదో తరగతి ఎగ్జామ్స్ 10 సార్లు రాసినా ఫెయిల్ అయ్యాడు.. చివరికి పాస్ కావడంతో...??

సాధారణంగా టెన్త్ క్లాస్( Tenth Class ) లో ఫెయిల్ అయితే ఒకటి, రెండుసార్లు ట్రై చేస్తాం.అప్పుడు కూడా ఫెయిలైతే ఇక పాస్ కావడం మన వల్ల కాదులే అని వదిలేసి ఏదో ఒక పని చేసుకుంటాము, కానీ మహారాష్ట్రలోని బీడ్ సిటీకి చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే అనే వ్యక్తి దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచాడు.

 He Failed The Class 10 Exams 10 Times But Finally Passed, Krishna Namdev Munde,-TeluguStop.com

మహారాష్ట్ర( Maharashtra ) స్టేట్ 10వ తరగతి బోర్డు పరీక్షలో పదిసార్లు ప్రయత్నించి ఇతడు ఫెయిల్ అయ్యాడు.అయినా నిరుత్సాహ పడుకోలేదు 11వసారి ఎగ్జామ్ రాస ఉత్తీర్ణత సాధించాడు.

అతడు పాస్ అయ్యాడని తెలిసి ఊరందరూ సంతోషించారు.స్ఫూర్తిగా కూడా ఫీలయ్యారు.

ఇటీవల 12th ఫెయిల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇందులో స్కూల్లో ఫెయిల్ అయినా, యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారి అయ్యాడు మనోజ్ శర్మ( Manoj Sharma ).ఆ కథ లాగానే కృష్ణ ప్రయాణం కూడా సాగింది.మనోజ్‌లా, ఎప్పటికీ వెనకడుగు వేయకూడదు కృష్ణ చూపించాడు.కృష్ణ తన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో అతని గ్రామం సంబరాలు చేసుకుంది.వారు డప్పులు వాయిస్తూ, డాన్సులు వేస్తూ అతడిని ఊరేగించారు. కృష్ణ 2018 నుంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ సంవత్సరం అతని విజయం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూపుతుంది.

కృష్ణ మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో సాధించిన అద్భుత విజయం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.పదే పదే ప్రయత్నించడం వల్లే విజయం సాధ్యమవుతుందని నిరూపించాడు.కృష్ణ చాలా కష్టపడి చదివాడు, చివరికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాడు.

గతంలో హిస్టరీలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఈసారి మాత్రం అధిగమించి విజయం సాధించాడు.కృష్ణ విజయం అతని కుటుంబానికి, గ్రామానికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

అతని తండ్రి నామదేవ్ ముండే ఒక ఘనమైన వేడుక నిర్వహించారు.గ్రామస్థులు కృష్ణను భుజాలపై ఎత్తుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube