ఇటీవల ఓ భారతీయ కుటుంబం స్విట్జర్లాండ్( Switzerland ) వెళ్లారు.ఆ ట్రిప్‌లో భాగంగా వారు కేవలం 11 రోజుల్లో స్విట్జర్లాండ్‌లోని 25 నగరాలను రూ.90,000 బడ్జెట్‌తోనే చుట్టేశారు.సాధారణంగా మన ఇండియాలో పది నగరాలు తిరిగితేనే లక్ష దాకా ఖర్చు వస్తుంది.
అలాంటిది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న స్విట్జర్లాండ్‌లో ఇంకెంత ఎక్కువ ఖర్చు రావాలి? అనే సందేహం కలగవచ్చు అయితే.ఈ కపుల్ ట్రిప్ చాలా చౌకగా సాగడానికి రహస్యం స్విస్ ట్రావెల్ పాస్.
ఈ పాస్ రైళ్లు, ట్రాములు, బస్సులు, బోట్లు, కొన్ని పర్వత రైల్వేలపై ప్రయాణించడానికి అపరిమిత అనుమతిని ఇస్తుంది.
అంతేకాకుండా, 500 కంటే ఎక్కువ మ్యూజియంలో ఉచిత ప్రవేశాన్ని కూడా ఇస్తుంది.వారు ఒక్కొక్కటి రూ.45,000/- ధర ఉండే రెండు పెద్దల పాస్‌లను కొనుగోలు చేశారు.వారిద్దరి పిల్లలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా ఫ్రీ ఫ్యామిలీ కార్డ్‌ను( Free Family Card )పొందారు.
అంతేకాకుండా మౌంట్ టిట్లిస్, గ్లేసియర్ 3000 వంటి ప్రదేశాలకు ఫ్రీ పర్యటనలు కూడా వారి పిల్లలకు లభించాయి.వారు తమ యాత్రను లోసాన్‌లో ప్రారంభించారు.మొదటి మూడు రోజులు దానిని తమ కేంద్రంగా ఉపయోగించుకున్నారు.అక్కడి నుండి, వారు గ్‌స్టాడ్, జ్వైసింమెన్, సానెన్ వంటి అందమైన పట్టణాలను సందర్శించారు.
రిజర్వేషన్లు అవసరం లేకుండా అద్భుతమైన దృశ్యాలను అందించే పానోరమిక్ రైళ్లను వారు స్విస్ పాస్ ద్వారా ఉచితంగా ఉపయోగించుకున్నారు.
మూడవ రోజు లోసాన్‌లోని ఒలింపిక్ మ్యూజియంను( Olympic Museum in Lausanne ) సందర్శించారు.స్విస్ ట్రావెల్ పాస్ వల్ల వారు ఫ్రీగా మ్యూజియంలోకి ఎంట్రీ ఇవ్వగలిగారు.జెనీవా సరస్సులో రిలాక్సింగ్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు.మోంట్రూక్స్, వెవే వంటి అందమైన పట్టణాలను సందర్శించారు.నాలుగో రోజు తమ కేంద్రాన్ని మీరింగెన్‌కు మార్చారు.బ్రియెంజ్ సరస్సులో ఇంటర్లాకెన్‌కు క్రూయిజ్ చేశారు.
స్విస్ ట్రావెల్ పాస్ వల్ల ఈ ప్రయాణానికీ ఖర్చు కాలేదు.ఐదవ రోజు జంగ్‌ఫ్రౌ కంటే ఎక్కువ ఆకట్టుకునే మానన్‌లిచెన్ పర్వతాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.
వారు కాగ్‌వీల్ రైలు, కేబుల్ కారులో ప్రయాణించారు, స్విస్ ట్రావెల్ పాస్ వారి ప్రయాణంలో కొంత భాగాన్ని కవర్ చేసింది.ఈ రౌండ్ ట్రిప్ టిక్కెట్ కుటుంబానికి కేవలం రూ.7,000/- మాత్రమే ఖర్చయింది.ఇలాంటి ట్రిప్పు సాగినంత కాలం వారు స్విట్జర్లాండ్ బ్యూటీ, ట్రైన్ రైట్స్ ఎంజాయ్ చేశారు.
వీరు తమ ట్రిప్‌కి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోగా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.