పవర్ లో ఉన్నవారిని తప్పుగా చూపిస్తే సమాజం ఒప్పుకోదు.. చిన్మయి సంచలన ట్వీట్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి శ్రీపాద( Singer Chinmayi Sripada ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సింగర్ గా పాటలను పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Singer Chinmayi Sripada Responds Balakrishna Misbehaviour Anjali Details, Singer-TeluguStop.com

అలాగే ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.కాగా సింగర్ చిన్మయి 2014లో నటుడు రాహుల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ జంటకు పండంటి కవల పిల్లలు కూడా జన్మించారు.

ఇది ఇలా ఉంటే తరచూ ఏదో ఒక ట్వీట్ తో వార్తల్లో నిలుస్తూ ఉండే చిన్మయి తాజాగా మరో ట్వీట్ తో వార్తల్లో నిలిచింది.తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ.

( Nandamuri Balakrishna ) హీరోయిన్‌ అంజలి( Anjali ) పట్ల వ్యవహరించిన తీరు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

మహిళలంటే ఆయననకు ఎంత చులకనో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు.

అయితే గతంలోనూ బాలయ్య నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం చాలాసార్లు జరిగింది.

తాజాగా ఈ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు.ఈ అంశంపై తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.చిన్మయి తన ట్వీట్‌లో రాస్తూ.‘ఈ వీడియోను షేర్ చేస్తున్న వారిలో నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి.ఆమె నవ్వు వైపు చూడండి.

ఆమెకు ఉండాలి కదా.ఇలాంటివీ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌పై స్పందించడం సాధ్యం కాదు.ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైంది.హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి లేదా వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోవడం పొరపాటే అవుతుంది.పవర్‌లో ఉన్న వారిని తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదు.ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వారిని.

అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు.మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి అని తన పోస్టులో రాసుకొచ్చింది చిన్మయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube