గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేషా.. ఈ వీకెండ్ కు బెస్ట్ మూవీ ఇదే!

సాధారణంగా ఒకేరోజు ముగ్గురు హీరోల క్రేజీ హీరోల సినిమాలు విడుదల కావడం అరుదుగా జరుగుతుంది.విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,( Gangs Of Godavari ) కార్తికేయ భజే వాయు వేగం,( Bhaje Vaayu Vegam ) ఆనంద్ దేవరకొండ గం గం గణేషా( Gam Gam Ganesha ) సినిమాలు ఈరోజు విడుదలయ్యాయి.

 Gangs Of Godavari Bhaje Vaayu Vegam Gam Gam Ganesha Movies Mini Reviews Details,-TeluguStop.com

ఈ మూడు సినిమాలు ఒకింత భారీ అంచనాలతో విడుదల కాగా మూడు సినిమాలలో ఎవరూ ఊహించని విధంగా భజే వాయు వేగం సినిమాకు బెటర్ టాక్ వచ్చింది.

వరుస విజయాలతో జోరుమీదున్న విశ్వక్ సేన్( Vishwak Sen ) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

విశ్వక్ సేన్ గోదావరి యాసలో కూడా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నేహాశెట్టి, అంజలి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించి మెప్పించడం గమనార్హం.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

Telugu Gam Gam Ganesha, Gangs Godavari, Karthikeya, Tollywood, Vishwak Sen-Movie

భజే వాయు వేగం మరీ అద్భుతం అని చెప్పలేం కానీ ఈ వీకెండ్ కు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు మంచి ఛాయిస్ అవుతుంది.కార్తికేయ( Karthikeya ) చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.విశ్వక్ సేన్ కు క్లాస్ సినిమాలే ప్లస్ అవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం వినిపిస్తోంది.

Telugu Gam Gam Ganesha, Gangs Godavari, Karthikeya, Tollywood, Vishwak Sen-Movie

అయితే విశ్వక్ సేన్ క్రేజ్ వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కొత్త సీసాలో పాత సారా అంటూ ఈ సినిమా గురించి నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ వారం కూడా సినీ అభిమానులకు భారీ స్థాయిలో షాకులు తగిలాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube