ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. సత్యభామతో ఆ కోరిక తీరింది: కాజల్

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) త్వరలోనే సత్యభామ( Satyabhama ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జూన్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Kajal Agarwal Interesting Comments About Satyabhama Movie Details,satyabhama, Ka-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాజల్ అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

తాజాగా కాజల్ ఒక ఇంటర్వూలో పాల్గొని సత్యభామ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Kajal Agarwal, Indian, Kajalagarwal, Satyabhama-Movie

తాను ఎప్పటినుంచో లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను.అయితే ఆ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా అయ్యి ఉండాలని భావించేదాన్ని ఈ సత్యభామ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని కాజల్ తెలిపారు.సత్యభామ సినిమాతో తన కెరీర్‌లో కొత్త ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది.

ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి మూవీని చేయడం  ఇది మొదటిసారి అంటూ ఈమె తన సంతోషాన్ని పంచుకున్నారు.

Telugu Kajal Agarwal, Indian, Kajalagarwal, Satyabhama-Movie

ఈ సినిమా కంటే ముందుగా చాలా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా( Female Oriented Movie ) అవకాశాలు వచ్చాయి కానీ కథ వినేటప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవడంతో వాటిని రిజెక్ట్ చేసానని తెలిపారు.సత్యభామ తనకు సెకండ్ ఇన్నింగ్స్ కాదని, ఈ మూవీతో తన కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని కాజల్ తెలిపారు.సినిమా అంటే ఇష్టం ఫ్యాషన్ ఉండటంతో నా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లినప్పటికీ తిరిగి సినిమాలలోకి వచ్చానని సినిమాపై ఉన్న ఇష్టాన్ని కాజల్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈమె అటు తన వ్యక్తిగత జీవితాన్ని ఇటు కెరియర్ ను ఎంతో బాలన్స్ చేస్తూ సినిమా రంగంలో దూసుకుపోతున్నారు.ఇప్పటికే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా హిట్ కొట్టిన ఈమె త్వరలోనే ఇండియన్ 2( Indian 2 ) సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube