దేవుడా.. ఇదేమి రోగమయ్య.. కడుపులో ఏకంగా 2 కేజీల పైన వెంట్రుకలు..

ప్రతిరోజు ప్రపంచంలో ఎన్నో రకాల వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.

 Madhya Pradesh Doctors In Chitrakoot Take Out Huge Hair Bunch From Womans Stomac-TeluguStop.com

ఇకపోతే తాజాగా భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి( Madhya Pradesh ) చెందిన ఓ మహిళ కడపులో వేగంగా 2 1/2 కేజీల పైన వెంట్రుకలు కనిపించాయి.దీంతో డాక్టర్లే షాక్ అయ్యారు.

ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని డాక్టర్లు నెవ్వరపోయారు.ఇక ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు చూస్తే.

Telugu Kg Stomach, Chitrakoot, Doctors, Bunch, Madhya Pradesh, Stomach Pain, Wom

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ లోని కుందు సద్గురు హాస్పిటల్ లో ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో( Stomach Pain ) ట్రీట్మెంట్ కు వచ్చింది.దీంతో వైద్యాన్ని మొదలుపెట్టిన డాక్టర్లు స్కానింగ్ రిపోర్టర్ ద్వారా అసలు విషయాన్నీ కనిపెట్టారు.ఆమె కడుపులో దాదాపు రెండున్నర కిలోల జుట్టు బయటపడింది.ఆమెకు రెండోసారి డెలివరీ అయిన తర్వాత వెంట్రుకలు తినడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇలా వెంట్రుకలు( Hair ) తినే వ్యాధిని వైద్య పరిభాషలో ట్రైకోబెజోర్ అని పిలుస్తారు.ఈ వ్యాధి ఉన్నవారు ఇలా వెంట్రుకలను తరుచుగా తింటూ ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒక శాతం మంది ఈ వ్యాధి కనిపిస్తుందని డాక్టర్లు తెలిపారు.

Telugu Kg Stomach, Chitrakoot, Doctors, Bunch, Madhya Pradesh, Stomach Pain, Wom

ఇలా మహిళ రెండో ప్రసవం తర్వాత తన వెంట్రుకలతో పాటు వేరొకరి వెంట్రుకలను కూడా తినడం మొదలుపెట్టింది.స్కాన్ చేయగా ఈ విషయం మొత్తం బయటపడింది.దాంతో డాక్టర్లు చేసేదేమీ లేక సీనియర్ వైద్యుల బృందం అంత కలిసి దాదాపు మూడు గంటలపాటు కష్టపడి కడుపులో నుంచి రెండు కిలోల పైన బరువుగల వెంట్రుకలను బయటకు తీశారు.సదరు మహిళ మధ్యప్రదేశ్లోని మహోప నివాసి.

ఇకపోతే గర్భధారణ జరిగిన సమయంలో డాక్టర్లు స్కానింగ్ చేయడం ద్వారా ఈ వ్యాధి బయటపడింది.ప్రస్తుతం ఆపరేషన్ చేసిన తర్వాత తీసిన వెంట్రుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube