బీజేపీ ఆయుధాలు ఇవే.. మోడీని ఎదుర్కోవడం కష్టమే !

కేంద్రంలో బీజేపీని( BJP ) గద్దె దించడం కష్టమేనా ? వచ్చే ఎన్నికల్లో కూడా విపక్షాల ప్రయత్నాలు శూన్యమేనా ? దేశ ప్రజలు 2024లో కూడా మోడీకే పట్టం కట్టబోతున్నారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఎందుకంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని.

 These Are The Weapons Of Bjp , Bjp ,congress ,prashant Kishore ,pm Modi ,modi Go-TeluguStop.com

ఇందులో ఎలాంటి సందేహం లేదని కమలనాథులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మరోవైపు ఈసారి ఎలాగైనా మోడీని( Modi ) గద్దె దించాలని విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ( Congress party )మోడీని ఎదుర్కొనే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు.పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం మొదలుకొని.

విపక్షలను ఏకం చేసే పని వరకు అన్నీ ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Modi, Pm Modi, Bjp-National News

అటు బీజేపీ యేతర పార్టీలు కూడా మోడీ ఓడించాలని కంకణం కట్టుకున్నాయి.ఇలాంటి ఆసక్తికర రాజకీయ పరిణామాల మద్య.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore )ఇటీవల చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి.

హిందూత్వం, జాతీయవాదం, సంక్షేమం వంటివి బీజేపీ మూల స్తంభాలని.వీటిలో ఏ రెండిటినైనా ఎదుర్కొనకపోతే.వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించడం కష్టమే అని ఆయన చెప్పుకుచ్చారు.బీజేపీ అనుసరిస్తున్న వీటిని విపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే.

ఎన్ని పార్టీలు ఏకం అయిన మోడీని గద్దె దించడం కష్టమే అని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.నిజానికి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలతో వాస్తవం లేకపోలేదు.

ఎందుకంటే కాషాయ పార్టీ మొదటి నుంచి కూడా హిందుత్వ వాదాన్ని గట్టిగా ప్రేరేపిస్తూ వస్తోంది.

Telugu Modi, Pm Modi, Bjp-National News

దాంతో దేశ వ్యపంగా ఉన్న హిందువుల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఉంది.అందువల్ల హిందువుల మెజారిటీ ఓటు బ్యాంకు బీజేపీ పక్షాన నిలిచే అవకాశం ఉంది.ఇక ప్రస్తుతం మోడీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమం.

పరిపాలనళో చూపిస్తున్న వైవిధ్యం ఇలా ఎన్నో అంశాలు ప్రధాని మోడీని ప్రత్యేకంగా నిపుళుతున్నాయి.ఇవన్నీ బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్లేస్ గా మారే అవకాశం ఉంది.

దాంతో వీటన్నిటిపై విపక్షాలు ప్రత్యేక దృష్టి సారించి.బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ రాజకీయం, మోడీ నియంత పాలన, ప్రజలపై పన్నుల భారం వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా విపక్షాలు వాడుకున్నప్పుడే మోడీని గద్దె దించడానికి కొంతలో కొంతైనా అవకాశం ఉంటుందని రాజకీయ పండితుల మాట.మరి విపక్షాలు ఎలాంటి వ్యూహాలతో మోడీని గద్దె దించే ప్రయత్నం చేస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube