సినిమా ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులకు తమ యాక్టింగ్ స్కిల్స్ తో దగ్గర కావడం సులువు కాదు.20 సంవత్సరాల వయస్సులోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ఎంతోమందిని ఫిదా అయ్యేలా చేశాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చిన వ్యక్తి భిక్షు అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకున్నారు.
భిక్షు( Bhikshu ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా దగ్గర శిక్షణ తీసుకున్నవాళ్లు ఎదగాలని భావిస్తానని ఆయన అన్నారు.వర్క్ విషయంలో నా భార్య, నా కూతురు సహాయం చేస్తారని భిక్షు తెలిపారు.
నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలని, 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయనని ఆయన చెప్పుకొచ్చారు.నా స్టూడెంట్స్ కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారని భిక్షు కామెంట్లు చేశారు.

ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తానని ఎక్కువమంది స్టూడెంట్స్ కు ఒకే సమయంలో శిక్షణ ఇస్తే ట్రైనింగ్ కు న్యాయం చేయలేమని భావిస్తానని భిక్షు చెప్పుకొచ్చారు.బాల రామాయణం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల వయస్సులో శిక్షణ తీసుకున్నాడని ఆయన కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ బాగా అల్లరి అని హర్రర్ కథలు చెప్పి పిల్లోడిని తారక్ భయపెట్టాడని భిక్షు పేర్కొన్నారు.

ఈ విధంగా తారక్ సరదాగా ఏడిపించేవాడని భిక్షు పరోక్షంగా కామెంట్లు చేశారు.తారక్ మర్యాదగా మాట్లాడతాడని గురువుగారు అని పిలుస్తాడని భిక్షు అన్నారు.జనతా గ్యారేజ్( Janatha Garage ) మూవీలో నేను చిన్న వేషం వేశానని భిక్షు వెల్లడించారు.
భిక్షు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో సినిమాల పరంగా బిజీ అవుతున్నారు.







