Janhvi Kapoor: అదంటే నాకు చాలా ఇష్టం.. ఆ విషయంలో నన్ను ఎవరు తొక్కలేరు: జాన్వీ కపూర్

అలనాటి తార శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ప్రస్తుతం ఓ రేంజ్లో దూసుకెళ్తుంది.స్టార్ హీరోయిన్లతో పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.

 Heroine Janhvi Kapoor Reveals Her Favorite Subject Is History-TeluguStop.com

అంతేకాకుండా స్టార్ హీరోల, దర్శకుల దృష్టిలో కూడా పడింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక తన అందాలతో బాలీవుడ్ వాళ్ళనే కాకుండా టాలీవుడ్ కుర్రాళ్లను కూడా తన వైపుకు మలుపుకుంది.

ఈ హాట్ బ్యూటీ తొలిసారిగా ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇక తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది.దీంతో వరుస అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

పైగా సినిమాలు చేయటం కోసం స్టార్ డైరెక్టర్లు కూడా వేచి చూస్తున్నారు.మొత్తానికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తో పోటీగా సందడి చేస్తుంది.

ఇక టాలీవుడ్ కు కూడా ఎన్టీఆర్ సినిమా దేవరతో ( Devara Movie ) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు పద్ధతికి పూర్తిగా వ్యతిరేకంగా మారింది.

అంటే హాలీవుడ్ రేంజ్ లో దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటీ.కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం చీరలు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ కనిపిస్తుంది.సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్ అని ఎంజాయ్ చేస్తూ అక్కడ హాట్ లుక్ లతో ఫోటో షూట్ చేయించుకుంటుంది.

Telugu Bawaal, Bollywood, Devara, Janhvi Kapoor, Janhvikapoor, Ntr, Sridevi, Tol

ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని మతి పోగొడుతుంది.నిజానికి శ్రీదేవి( Sridevi ) తన కూతుర్ని ఇలా చూసి ఇంకెంత పొంగిపోయేదో అని చెప్పాలి.తను ఈ లోకానికి దూరమైన కూడా జాన్వీ తన తల్లి కోరిక తీర్చిందని చెప్పాలి.

ఇక జాన్వీ చూడ్డానికి మంచి ఫిజిక్ తో ఉంటుంది.ముఖ్యంగా తన బాడీ స్ట్రక్చర్ ఎక్కడ కూడా లోపం ఉన్నట్లు కనిపించదు.

Telugu Bawaal, Bollywood, Devara, Janhvi Kapoor, Janhvikapoor, Ntr, Sridevi, Tol

ఇక తల్లికి తగ్గట్టే తను కూడా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది.ఇదంతా పక్కన పెడితే.జాన్వీ కపూర్ రీసెంట్ గా బాలీవుడ్ లో బవాల్( Bawaal ) అనే సినిమాలో నటించగా శుక్రవారం ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకుంటుంది.

అయితే తాజాగా తనకు సంబంధించిన ఒక విషయంను పంచుకుంది.

Telugu Bawaal, Bollywood, Devara, Janhvi Kapoor, Janhvikapoor, Ntr, Sridevi, Tol

తనకు హిస్టరీ( History ) అంటే చాలా ఇష్టమట.ఇప్పటికీ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎక్కువగా చదువుతూ ఉంటదట.చిన్నప్పుడు స్కూల్లో ఎవరు అడిగినా సరే తన ఫేవరెట్ సబ్జెక్టు హిస్టరీ అని చెప్తూ ఉండేదట.

అంతేకాదు ఏమాత్రం టైం దొరికిన టైం పాస్ అవ్వాలన్న తను ఎక్కువగా హిస్టరీని చదువుతూ ఉంటుందట.తన చిన్నప్పుడు స్కూల్లో హిస్టరీ పై ఎవరైనా వ్యాసరచన పోటీలు పెడితే తానే ఫస్ట్ వచ్చేదట.

ఇక ఆ విషయంలో తనను ఎవరు తొక్కలేరని.తనతో పోటీ పడలేపోయారని అన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube