అంబటిని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు.. పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

పవన్, సాయితేజ్( Pawan, Saitej ) కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఈరోజు ఆక్యుపెన్సీ తగ్గింది.ఈ సినిమాలో అంబటి రాంబాబును పృథ్వీరాజ్ ఇమిటేట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.

 Pruthwiraj Sensational Comments About Ambati Rambabu Details Here Goes Viral , P-TeluguStop.com

అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.అయితే అంబటి రియాక్ట్ అయిన నేపథ్యంలో పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అంబటిని( Ambati ) ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.శ్యాంబాబు పాత్రపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఆస్కార్ నటుడేం కాదని పృథ్వీరాజ్( Prithviraj ) వెల్లడించారు.

బ్రో సినిమాలో బాధ్యత లేని వ్యక్తి రోల్ నాకు ఇచ్చారని ఆ రోల్ ను నేను చేశానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.నా పాత్ర డ్యాన్స్ విచిత్రంగా ఉండటం వల్ల తనను ఇమిటేట్ చేశానని అంబటి అనుకుంటున్నారేమో అని పృథ్వీరాజ్ వెల్లడించారు.

Telugu Ambati, Ambati Rambabu, Bro, Pruthwiraj-Movie

అయితే అంబటి రాంబాబును( Ambati Rambabu ) ఇమిటేట్ చేశామని చెబితే మరిన్ని వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పృథ్వీరాజ్ ఈ విధంగా చెప్పి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పృథ్వీరాజ్ ప్రస్తుతం జనసేనకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ సినిమాలో ఆఫర్ దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పృథ్వీరాజ్ మెగా హీరోల సినిమాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

Telugu Ambati, Ambati Rambabu, Bro, Pruthwiraj-Movie

పృథ్వీరాజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకోవాలని కెరీర్ పరంగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో చేరడం వల్ల ఆయనకు సినిమా ఆఫర్లు దక్కాయి.కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం వల్ల పృథ్వీరాజ్ వైసీపీకి దూరం కావాల్సి వచ్చింది.

పృథ్వీరాజ్ అంబటిని ఇమిటేట్ చేయడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.అంబటి మాత్రం తనను ఇమిటేట్ చేయడంపై సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube