కార్తీకదీపం సీరియల్( Karthikadeepam serial ) ద్వారా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటీమణులలో ప్రేమీ విశ్వనాథ్ ఒకరు.కార్తీకదీపం సీరియల్ పూర్తైన తర్వాత ప్రేమీ విశ్వనాథ్( Premi Vishwanath ) మరిన్ని తెలుగు సీరియళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కార్తీకదీపం సీరియల్ కు సీక్వెల్ వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కార్తీకదీపం సీరియల్ కథ, కథనాలు అద్భుతం అని చెప్పలేము.
అయితే ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల( Nirupam Paritala ) అభినయం వల్ల ఈ సీరియల్ సక్సెస్ సాధించింది.ఈ జోడీని రిపీట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ మా ఛానల్ లో మా బోనాల జాతర పేరుతో ఒక షో ప్రసారం కానుండగా ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

30 సెకన్ల నిడివి ఉన్న ప్రోమోలో వర్షిణితో కలిసి షోకు హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ రవి నిరుపమ్ ను దీపలో ఎవరికీ తెలియని హిడెన్ టాలెంట్ ఉందా అని అడగగా శోభా శెట్టి( Shobha Shetty ) వెంటనే డాక్టర్ బాబు దగ్గర చాలా ఉంటుంది అని చెబుతుంది.ఆ కామెంట్ కు షోలో పాల్గొన్న వాళ్లంతా పగలబడి నవ్వుతారు.ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎవరికీ తెలియని టాలెంట్ అంటే నేను ఎక్కువసేపు నిద్రపోతాను అని ఆమె కామెంట్లు చేశారు.

నిరుపమ్ వెంటనే నేను అంతగా దాచుకుని చేసే పనులు అయితే ఏమీ లేవని పేర్కొన్నారు.బ్యాక్ గ్రౌండ్ లో వెంటనే దండాలయ్యా సాంగ్ ప్లే అవుతుంది.ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ ప్రోమోకు 1,10,000 వ్యూస్ వచ్చాయి.ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.







