భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్(( World Cup ) ) కు అర్హత సాధించే క్వాలిఫయర్ మ్యాచ్ లలో భాగంగా తాజాగా స్కాట్లాండ్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓటమిని చవిచూసిన వెస్టిండీస్ దాదాపుగా వన్డే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్టే.తాజాగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన స్కాట్లాండ్( Scotland ) 43.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది.ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇంకా వెస్టిండీస్ సూపర్ సిక్స్ దశలో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.అయినప్పటికీ ఫైనల్ చేరడం కష్టమే.
మరి వెస్టిండీస్ ఫైనల్ చేరే అవకాశాలు ఏంటో చూద్దాం.

రూల్స్ ప్రకారం సూపర్ సిక్స్ దశలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు మాత్రమే భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి.వెస్టిండీస్ మిగిలి ఉన్న రెండు మ్యాచులు ఆడిన కూడా ప్రపంచ కప్ కు అర్హత సాధించడం కష్టమే.ఎందుకంటే శ్రీలంక, జింబాబ్వే దేశాలు ఇప్పటికే 6 పాయింట్లు సాధించాయి.

మరి వెస్టిండీస్ జట్టు ప్రపంచ కప్ కు అర్హత సాధించాలంటే అది కేవలం పాకిస్తాన్ తోనే (Pakistan )సాధ్యం అవుతుంది.అది ఎలా అంటే పాకిస్తాన్ జట్టుకు, భారత్లో జరిగే టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి సెక్యూరిటీ వచ్చి భారత్లో చెక్ చేస్తారని ఏదో హంగామా మొదలైంది.ఒకవేళ ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే.క్వాలిఫయర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన జట్టు కూడా టోర్నీకు అర్హత సాధిస్తుంది.అంటే వెస్టిండీస్ తన మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో గెలిస్తే పాయింట్లు పట్టికలో మూడవ స్థానానికి వస్తుంది.
అంతేకాదు స్కాట్లాండ్, నెదర్లాండ్ తమ తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా ఓడిపోవాలి.ఇన్ని జరగడం ఒకరకంగా కష్టమే కాబట్టి వెస్టిండీస్ ప్రపంచ కప్ టోర్నీకు అర్హత సాధించడం కష్టమే.







