అవిసె గింజలు( Flaxseeds ).ఈ మధ్య వీటి పేరు తరచూ వినిపిస్తోంది.
వినియోగం కూడా బాగా పెరిగింది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా తమ డైట్ లో అవిసె గింజలను చేర్చుకుంటున్నారు.
అవిసె గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్ నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా అవి మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అవిసె గింజలను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
ఎముకలు దృఢంగా మారతాయి.
చర్మం యవ్వనంగా మెరుస్తుంది.అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే అవిసె గింజలతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం లేదా అతి తీసుకోవడం చేయరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అతి అనేక అనర్థాలకు దారి తీస్తుంది.ఇది అవిసె గింజలకు కూడా వర్తిస్తుంది.బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు అవిసె గింజలను అతిగా తీసుకుంటారు.
దీని వల్ల జీవక్రియ ప్రక్రియ( Metabolic process ) పూర్తిగా దెబ్బ తింటుంది.ఫలితంగా బరువు తగ్గడం కాదు అనేక సమస్యలు తలెత్తుతాయి.
అలాగే అవిసె గింజలకు శరీరంలో వేడిని పెంచే గుణం ఉంది.

అందువల్ల అవిసె గింజలను రోజు తీసుకోవడం వల్ల కఫా, పిత్త సమస్యలు తీవ్రతరం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతేకాదు అవిసె గింజలను ఎలాంటి లిమిట్ లేకుండా ఓవర్ గా తీసుకుంటే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, వాంతులు( Vomiting ) వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఆరోగ్యానికి మంచిదని లేక త్వరగా బరువు తగ్గుతామని చెప్పి అవిసె గింజలను అతిగా తీసుకోవడం లేదా నిత్యం తీసుకోవడం వంటివి చేయకండి.