ప్రస్తుతం కార్తీకమాసంలో శ్రీనివాసుడి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.శనివారం స్వామివారిని దాదాపు 80 వేల మంది దర్శించుకోగా, 37 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.
ఇక స్వామివారికి కానుకల రూపంలో భక్తులు దాదాపు 5 కోట్ల రూపాయలు హుండీలో వేశారు.శ్రీవారి ఆలయంలో వైఖానాస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడికి కైంకారాలు అర్చకులు నిర్వహిస్తున్నారు.
ప్రత్యూషగాల ఆరాధనతో ఆలయ ద్వారములకు అర్చకులు తెరుస్తారు.వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు స్వామివారి సన్నిధిలోకి వచ్చి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు.
బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రం తో స్వామి వారిని మేలుకొలుపుతారు.బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత స్తోత్రం, ప్రవర్తి మంగళ శాసనం వంటివి పాటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యక్ష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చిపాలను అర్చకులు నివేదిస్తారు.
ముందురోజు రాత్రి పవళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక భేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవస్థానంలో పవళింప చేస్తారు.అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణను అర్చకులు జరుపుతారు.
దీనినే కైకార్యపరుల హారతి అని కూడా అంటారు.శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తర్వాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది.
దీని తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని వారు స్వీకరించిన తర్వాత జియ్యం గార్లకు, సన్నిధి గొల్లలకు బ్రహ్మ తీర్ధాన్ని అందిస్తారు.అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పాటిస్తుండగా సన్నిధిలో శ్రీవారికి కర్పూర నిరాజరణ సమర్పణ ను అర్చకులు చేస్తారు.
మహంతి మఠం, మైసూరు రాజావారి, ప్రతినిధి తాళ్లపాక అన్నమయ్య వంశీయులు, తాళ్లపాక ఒక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు.ఇదే సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా చెబుతూ ఉంటారు.