Golden Hotel Vietnam : టాయిలెట్‌తో సహా ఆ బిల్డింగ్ అంతా బంగారమే.. ఎక్కడుందంటే..

అత్యంత ఖరీదైన లోహాలలో బంగారం ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు.ఒంటిమీద కొన్ని గ్రాముల బంగారం ధరిస్తే చాలు వారు ధనికులని భారతదేశంలో పరిగణిస్తుంటారు.

 That Building Including The Toilet Is All Gold Where Is It Golden Hotel, Vietnam-TeluguStop.com

అలాంటిది ఒంటినిండా బంగారం వేసుకుంటే ఇక వారు కోటీశ్వరులేనని చెప్పవచ్చు.అయితే ఒక దేశంలో ఒంటిమీద బంగారం ధరించడం ఏమో గానీ మొత్తం హోటల్‌నే బంగారంతో కట్టేశారు.

హోటల్ అంటే అదేదో రెండు గదుల బిల్డింగ్ కాదు.రెస్టారెంట్, ఫిట్నెట్ సెంటర్, బార్, బిజినెస్ సెంటర్ వంటి అనేక సదుపాయాలు ఉన్న అతిపెద్ద హోటల్ ఇది.ఈ హోటల్లో ఒక్కోచోట బంగారంతో కొన్నిటిని నిర్మిస్తే మరో చోట బంగారం పూతతో రిచ్ లుక్ తీసుకొచ్చారు.ఈ హోటల్ వియత్నాం రాజధాని హనోయ్ నగరంలో ఉంది.

ఈ 5-స్టార్ హోటల్‌లో గోడల దగ్గరి నుంచి టాయిలెట్ దాకా ప్రతిదానికి పసిడి పూత పూసి అత్యంత సుందరంగా తయారు చేశారు.ఇక వాష్ రూమ్ లో ఉండే బాత్ టబ్‌ను బంగారంతో తయారు చేశారు.

గోడలకు 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ వేశారట.ఈ హోటల్ బిల్డింగ్ మీద నుంచి చూస్తే.

హనోయ్ నగరం మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందట.అందుకే ఇక్కడికి విదేశీయులు కూడా వస్తుంటారు.

బంగారంతో నిర్మించిన ఈ హోటల్లో అడుగు పెట్టాలంటే కేవలం లక్షాధికారులు కోటీశ్వరులకు మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఇక్కడ అన్ని హోటల్స్ లో ఉన్నట్లే రేట్లు ఉంటాయి.

ఈ హోటల్‌లో సింగిల్ నైట్‌కి రూ.9,000 చెల్లిస్తే సరిపోతుంది.ఇంకా ఈ హోటల్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాల కోసం అధిక ధర పెట్టాల్సి ఉంటుంది.ఇక్కడ బస చేసేవారికి రాయల్టీ స్టేటస్‌ను హోటల్ యాజమాన్యం అందిస్తుంది.అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులూ సకల భోగాలు అనుభవించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube