సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై రాజమండ్రిలో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను, పార్టీ నేతలను, వీర మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కోర్టు ఆదేశాలతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.ఇటీవలే పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియామకం అయిన సంగతి తెలిసిందే.







