దీపావళి రోజున మట్టి దీపాలను ఇంట్లో ఎక్కడెక్కడ ఉంచాలో తెలుసా..?

పెద్దవారికి, పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగ అంటే దీపావళి అని కచ్చితంగా చెప్పవచ్చు.దీపావళి రోజున ఇల్లు, విధులు, గ్రామాలు, పట్టణాలు దీపాల వెలుగులో మిలమిల మెరుస్తూ ఉంటాయి.

 Do You Know Where To Keep Clay Lamps At Home On Diwali , Clay Lamps, Home ,-TeluguStop.com

నిజానికి ఇప్పుడు ఎన్నో రకాల దీపాలు అందుబాటులోకి వచ్చాయి.కొవ్వొత్తులతో కూడా దీపాలను వెలిగిస్తారు.

కానీ మట్టి ప్రమిదలలో( Clay lamps ) నూనె పోసి ఒత్తి పెట్టి దీపాన్ని వెలిగించడమే సరైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు.ఇల్లు నిండుగా కనిపించాలని ఇంటి ముందు ఎక్కడ పడితే అక్కడ దీపాలను చాలామంది ప్రజలు పెడుతూ ఉంటారు.

పెద్దలు చెబుతున్న దాని ప్రకారం దీపావళి రోజు( Diwali ) కచ్చితంగా ఇంటి ముందు 13 దీపాలను వెలిగించాలి.అయితే అవి ఎక్కడెక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Clay Lamps, Devotional, Diwali, Goddess Lakshmi, Pooja-Latest News - Telu

ముఖ్యంగా చెప్పాలంటే మొదటి దీపం మీ కుటుంబ సంరక్షణ కోసం, మీ కుటుంబాన్ని అకాల మరణం నుంచి కాపాడడం కోసం వెలిగించాలి.ఈ దీపాన్ని మీరు చెత్త వేసే డస్ట్ బిన్ దగ్గర ఉంచాలి.అలాగే ఆ చెత్తకుండీ కచ్చితంగా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.రెండవ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి.ఈ దీపాన్ని పూజా మందిరంలో ఉంచాలి.ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది.

మూడవ దీపం లక్ష్మీదేవి( Goddess Lakshmi ) కోసం వెలిగించాలి.ఈ దీపాన్ని లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఉంచాలి.

నాలుగవ దీపం మీ ఇంట్లోనీ వారు సంతోషంగా ఉండడానికి వెలిగించాలి.ఈ దీపాన్ని తులసి మొక్క ముందు ఉంచాలి.

Telugu Clay Lamps, Devotional, Diwali, Goddess Lakshmi, Pooja-Latest News - Telu

ఐదో దీపం విషయానికి వస్తే ఇంట్లో ప్రేమను, ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.దీన్ని కచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి.అలాగే ఆరవ దీపాన్ని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం రావి చెట్టు ముందు ఉంచాలి.ఏడవ దీపం మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో వెలిగించాలి.8వ దీపాన్ని మీరు ఎక్కడా అయితే ఇంటి నుంచి చెత్తను పడేస్తారో ఆ ప్రదేశంలో ఉంచాలి.9వ దీపాన్ని మీ బాత్రూం గుమ్మం దగ్గర ఉంచాలి.పదవ దీపాన్ని ఇంటి పైకప్పు పై ఉంచాలి.11వ దీపాన్ని కిటికీల వద్ద ఉంచాలి.12వ దీపాన్ని అందరికీ కనబడేలా ఉంచాలి.13వ దీపాన్ని మీ ఇంటికి వెళ్లేదారిలో నచ్చిన చోట ఉంచడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube