వ‌ర్షాకాలంలో వేధించే తామర‌కు ఈ ఎఫెక్టివ్ టిప్స్‌తో గుడ్‌బై చెప్పేయండి!

వ‌ర్షాకాలంలో అధికంగా వేధించే వాటిలో తామ‌ర ఒక‌టి.ఇది చ‌ర్మ వ్యాధే కాదు అంటు వ్యాధి కూడా.ఒక‌రి నుంచి ఒక‌రికి ఈజీగా పాకేస్తుంది.పైగా తామ‌ర వ‌చ్చిన ప్రాంతంలో దుర‌ద, ఎర్ర‌గా మార‌డం, మంట ఎక్కువ‌గా ఉంటుంది.దాంతో తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతుంటారు.ఈ క్ర‌మంలోనే తామ‌ర‌ను ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

 Home Remedies, Ringworm, Skin Allergy, Health Tips, Good Health, Health,latest-TeluguStop.com

అయితే ఇంట్లోనే కొన్ని న్యాచుర‌ల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా ఈ చ‌ర్మ వ్యాధికి గుడ్ బై చెప్పొచ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

తామ‌ర‌ను నివారించ‌డంలో జాజికాయ గ్రేట్‌గా స‌హ‌య‌ప‌డుతుంది.జాజికాయ‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ జాజికాయ పొడిలో కొద్దిగా వాట‌ర్‌ను మిక్స్ చేసి ఆ పాంత్రంలో అప్లై చేయాలి.ఇలా రోజుకు రెండు సార్లు సార్లు రాస్తూ ఉంటే క్ర‌మంగా తామ‌ర మ‌రియు దాని ల‌క్ష‌ణాలు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే బొప్పాయి పండు విత్త‌నాల‌తోనూ ఈ స‌మ‌స్య‌ను చెక్ పెట్ట‌వ‌చ్చు కొన్ని బొప్పాయి పండు విత్త‌నాల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా వేప నూనెను వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వండి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక కొన్ని వేపాకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ప‌సుపు మ‌రియు కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఆ పాంత్రంలో రాసుకుని ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే తామ‌ర దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube