వీడియో: బిహార్ వరదల్లో కొట్టుకుపోతున్న పిల్లోడు.. వంట పాత్రే ఆధారం..

బిహార్ రాష్ట్రం ప్రస్తుతం భయంకరమైన వరదలతో జల ప్రళయాన్ని తలపిస్తుంది.అనేక జిల్లాలు నీట మునిగిపోయాయి.

 Video-child Drowning In Bihar Floods-cooking Utensil Is The Basis, Bihar Floods,-TeluguStop.com

మునుపు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పెరుగుతున్న నీటి స్థాయితో సముద్రాలను తలపిస్తున్నాయి.బాగ్మతి, గండక్ (Bagmati, Gandak )నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

గ్రామాలు మొత్తం నీట మునిగిపోయాయి.ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవలసి వస్తోంది.

ముఖ్యంగా కోసి నది ప్రాంతంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగు నీరు దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

ముఖ్యంగా బాగ్మతి, గండక్ నదులు చాలా పెద్ద ఎత్తున నీటిని ప్రజల నివాసాల్లోకి పంపిస్తున్నాయి.గ్రామాలు మొత్తం నీట మునిగిపోయాయి.గ్రామాల ప్రజలకు ఆశ్రయం, ఆహారం అందించడానికి ఎలాంటి సహాయం అందడం లేదు.వరదల వల్ల ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులు కోల్పోయి, రోడ్లపై నిరాశతో కండతడి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బిహార్ నుంచి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరి మనసు కదిలిపోతోంది.ఆ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు వంట(cooking) చేసే పాత్రలో కూర్చుని భారీ వరద నీళ్లలో తేలుతున్నాడు.భయంతో ఏడుస్తూ నీళ్లలో కొట్టుకుపోతున్నాడు.

అతడి పరిస్థితి చూస్తే చాలా జాలేసింది.అంతేకాదు ఆ బాలుడి ప్రాణాలకు ప్రమాదం ఉందా అనే ఆందోళన కూడా మొదలైంది.ఈ వీడియో చూసిన వారందరూ చాలా బాధపడ్డారు.‘ఆలోక్ చిక్కు’( Alok Chikku ) అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియో చూస్తే బిహార్‌లో వరదల కారణంగా ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థమవుతుంది.

వర్షాల, వరదల గురించి ప్రజలకు ముందుగానే సమాచారం అందించి ఉంటే వారు ఎప్పుడో సురక్షితమైన ప్రదేశాలకు తరలిపోయేవారు.కానీ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శలు వస్తున్నాయి.చాలామంది ముంపు ప్రాంతాల్లో చెప్పకపోయారు వారికి సహాయాలు చేసే వీలు కూడా కుదరడం లేదు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారానైనా వారికి సత్వర సహాయం అందించాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube