మహిళలకు మేలు చేసే ఉల్లికాడలు.. వారానికి ఒక్కసారి తిన్న బోలెడు లాభాలు!

ఉల్లికాడలు( Spring Onions ).వీటినే ఇంగ్లీషులో స్ప్రింగ్ ఆనియన్స్ అని పిలుస్తారు.

 Wonderful Health Benefits Of Having Spring Onions! Spring Onions, Spring Onions-TeluguStop.com

సూప్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ తదితర ఆహారాల్లో ఉల్లికాడలను ఉపయోగిస్తారు.అయితే ఉల్లికాడలు తినడానికి రుచికరంగానే కాదు ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటాయి.

ముఖ్యంగా మహిళలకు ఉల్లికాడలు చాలా మేలు చేస్తాయి.వారానికి ఒక్కసారి తిన్న కూడా బోలెడు లాభాలను అందిస్తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఉల్లికాయ‌లతో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Tips, Latest, Benefits-Telugu Health

ఇటీవ‌ల రోజుల్లో పాతికేళ్ల‌కే చాలా మంది మ‌హిళ‌లు న‌డుము నొప్పి( Back Pain ) అంటున్నారు.అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఎముకల ఆరోగ్యానికి మ‌ద్ద‌తు ఇస్తాయి.బోన్ డెన్సిటీని పెంచేందుకు అవ‌స‌ర‌మ‌య్యే కాల్షియం, విట‌మిన్ కె మ‌రియు విట‌మిన్ సి వంటి పోష‌కాల‌ను అందిస్తాయి.

అందువ‌ల్ల మ‌హిళ‌లు ఉల్లికాయ‌లు తింటే ఎముక‌ల‌ను దృఢంగా మార‌తాయి.అలాగే స్ప్రింగ్ ఆనియన్స్‌లో విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి కంటి చూపును పెంచుతాయి.కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌కు అడ్డు క‌ట్ట వేస్తాయి.

ఉల్లి కాడ‌ల్లో విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.స్ప్రింగ్ ఆనియన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియ మరియు ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.

Telugu Tips, Latest, Benefits-Telugu Health

రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచడంలో తోడ్ప‌డే విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల‌ను మ‌నం ఉల్లికాడ‌ల ద్వారా పొంద‌వ‌చ్చు.డైట్ లో ఉల్లి కాడ‌ల‌ను చేర్చుకోవ‌డం వ‌ల్ల శరీర కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది.స్కిన్ ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.ఉల్లి కాడ‌ల్లో మెండుగా ఉండే మెగ్నీషియం కండరాల తిమ్మిరి మరియు పుండ్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.అంతేకాదు, యాంటీ క్యాన్సర్ ల‌క్ష‌ణాల‌ను కూడా ఉల్లికాడ‌లు క‌లిగి ఉంటాయి.

వారానికి క‌నీసం ఒక‌సారి ఉల్లికాడ‌ల‌ను తీసుకుంటే క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube