మహిళలకు మేలు చేసే ఉల్లికాడలు.. వారానికి ఒక్కసారి తిన్న బోలెడు లాభాలు!
TeluguStop.com
ఉల్లికాడలు( Spring Onions ).వీటినే ఇంగ్లీషులో స్ప్రింగ్ ఆనియన్స్ అని పిలుస్తారు.
సూప్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ తదితర ఆహారాల్లో ఉల్లికాడలను ఉపయోగిస్తారు.అయితే ఉల్లికాడలు తినడానికి రుచికరంగానే కాదు ఎన్నో రకాల పోషకాలను కూడా కలిగి ఉంటాయి.
ముఖ్యంగా మహిళలకు ఉల్లికాడలు చాలా మేలు చేస్తాయి.వారానికి ఒక్కసారి తిన్న కూడా బోలెడు లాభాలను అందిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లికాయలతో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం పదండి.
"""/" /
ఇటీవల రోజుల్లో పాతికేళ్లకే చాలా మంది మహిళలు నడుము నొప్పి( Back Pain ) అంటున్నారు.
అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.బోన్ డెన్సిటీని పెంచేందుకు అవసరమయ్యే కాల్షియం, విటమిన్ కె మరియు విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తాయి.
అందువల్ల మహిళలు ఉల్లికాయలు తింటే ఎముకలను దృఢంగా మారతాయి.అలాగే స్ప్రింగ్ ఆనియన్స్‌లో విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి కంటి చూపును పెంచుతాయి.కంటి సంబంధిత సమస్యలకు అడ్డు కట్ట వేస్తాయి.