నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తిరుమలలో చిన్నారి లక్షిత మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
ఈ మేరకు బాలిక తల్లిదండ్రులను పూర్తిస్థాయిలో విచారించాలని సూచించారు.
ఆడబిడ్డ విషయం కాబట్టి తనకు అనుమానం ఉందని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్, ఈవోతో మాట్లాడాడని చెప్పారు.ఘటనపై విచారణ జరిపిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పారని వెల్లడించారు.
బాలిక కుటుంబానికి టీటీడీ తరపున ఆర్థికసాయం చేస్తామని చెప్పారన్నారు.చిన్నారి లక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.