ఏపీలోని వైసీపీలో సీట్ల మార్పు రాజకీయం రసవత్తరంగా మారుతోంది.పిఠాపురం సీటు రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శనకు సిద్ధం అయ్యారని సమాచారం.ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు.అయితే సీటు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న పెండెం దొరబాబు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







