రజనీకాంత్ పరిస్థితి మరీ ఇంత ఘోరమా.. పెద్దన్న మూవీ రేటింగ్ ఎంతంటే?

సౌత్ ఇండియాలో రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.ఒకప్పుడు రజనీకాంత్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించాయి.

 Rajanikanth Peddanna Movie Rating Details Here  ,rajanikanth ,peddanna Movie ,-TeluguStop.com

నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో సినిమాలు తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అయితే రోబో తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే మరికొన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 2.0 సినిమా సైతం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.గతేడాది రజనీకాంత్ నటించి విడుదలైన పెద్దన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానెల్ లో ప్రసారమైంది.ఈ సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ కేవలం 6.35 కావడం గమనార్హం.ఈ రేటింగ్ ను చూసిన నెటిజన్లు రజనీకాంత్ పరిస్థితి ఇంత ఘోరమా అని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Keerthi, Kollywood, Nayanatara, Peddanna, Rajanikanth, Tollywood, Trp, Tu

ఈ సినిమాకు పోటీగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ట్రక్ జగదీష్ సినిమాకు ఈ సినిమాతో పోలిస్తే ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం.రొటీన్ కథతో తెరకెక్కడంతో పెద్దన్న సినిమాకు ప్రేక్షకాదరణ దక్కలేదు.అయితే మాస్ సినిమాలకు బుల్లితెరపై మంచి రేటింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి.జెమిని ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో రీచ్ తక్కువ కావడంతో ఈ సినిమాకు మంచి రేటింగ్ రాలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Keerthi, Kollywood, Nayanatara, Peddanna, Rajanikanth, Tollywood, Trp, Tu

సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది.భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన జెమిని ఛానల్ కు ఈ రేటింగ్ వల్ల నష్టం తప్పదు.

రజనీకాంత్ తర్వాత సినిమాల కథల విషయంలోనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని రజనీకాంత్ రొటీన్ కథలను ఎంచుకోకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube