తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంత మంది నటి నటులు కూడా వాళ్ల స్ఫూర్తి తో ఇండస్ట్రీ కి వస్తున్నారు ఇక అలాంటి వాళ్లలో చాలా మంది ఉన్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ కి డాన్స్ మాస్టర్ గా వచ్చి తనదైన రీతిలో స్టార్ హీరోలకి కొరియోగ్రాఫర్ గా( Choreographer ) చేసి మంచి విజయాలను అందుకున్న లారెన్స్ మాస్టర్( Lawrence ) నాగార్జునతో చేసిన మాస్ అనే సినిమాతో తెలుగు లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఆ తర్వాత చాలా సినిమాలను డైరెక్షన్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక ఆయన కి బాగా పేరు తెచ్చిన సినిమాలు ఎంటి అంటే కాంచన( Kanchana ) సిరీస్ అనే చెప్పాలి.ఈ సీరీస్ తో ఆయన వరుసగా హిట్లు అందుకున్నారు…ఇక ఇప్పుడు జిగర్తండ సినిమాలో( Jigarthanda ) కూడా హీరో గా చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే తెలుగు లో మళ్ళీ లారెన్స్ మాస్టర్ ఒక సినిమాని డైరెక్షన్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…

ఇక ఈ సినిమాలో హీరో గా రవితేజ( Raviteja ) చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి రవితేజ, లారెన్స్ కాంబో లో సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది అప్పుడు ఆగిపోయింది ఇక ఇప్పుడు ఒక కొత్త స్టోరీ తో వచ్చి మనందరినీ ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందో… ఇక ఇప్పటికైతే ఇద్దరు వాళ్ల వాళ్ల ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా 2024 సమ్మర్ లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం అయితే ఉంది…
.







