ఫాల్గుణ అమావాస్య ఎప్పుడో తెలుసా.. ఆన్లైన్లో తిరుమల వైకుంఠ దర్శన టికెట్లు ఈరోజు నుంచే..

హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలోని అమావాస్య 2023 ఫిబ్రవరి 19 ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 20 2023 మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం ఉంది.ఫాల్గుణ అమావాస్య రోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల 56 నిమిషములకు మొదలయ్యే అవకాశం ఉంది.

 Do You Know When Is Phalguna Amavasya? Tirumala Vaikuntha Darshan Tickets Online-TeluguStop.com

సూర్యాస్తమయం సాయంత్రం 6:15 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది.చంద్రోదయం ఉదయం7 గంటల 7 నిమిషములకు మొదలయ్యే అవకాశం ఉంది.

చంద్రస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది.

అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషములకు మొదలై మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది.

దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషములకు మొదలై మధ్యాహ్నం 1:43 నిమిషముల వరకు ఉండే అవకాశం ఉంది.రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం మూడు గంటల 59 నిమిషముల వరకు ఉండే అవకాశం ఉంది.

అమృతకాలం తెల్లవారుజామున రెండు గంటల 38 నిమిషముల నుంచి నాలుగు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది.రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషముల వరకు ఉండే అవకాశం ఉంది.

శ్రీవారి దేవాలయంలో ఈరోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లను విడుదల చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.జనవరి రెండవ తేదీ నుంచి 11వ తేదీ వరకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల కోటాను ఈరోజు విడుదల చేయనున్నారు.రోజుకు 20వేల చొప్పున 10 రోజులకు సంబంధించిన మొత్తం రెండు లక్షల టికెట్లను శనివారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.24 ఉదయం 11 గంటల నుంచి టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టికెట్లు కలిగిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube