సంగారెడ్డి జిల్లాలో కత్తితో వ్యక్తి వీరంగం... ముగ్గురిపై దాడి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దారుణం జరిగింది.వాణినగర్ లో ఓ వ్యక్తి డ్యూటీలకు వెళ్తున్న సమయంలో ముగ్గురిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

 In Sangareddy District, A Man Armed With A Knife Attacked Three People-TeluguStop.com

ఈ దాడిలో మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే కుటుంబ కలహాలతోనే దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

మృతురాలు సుజాత వాణినగర్ లో తన అక్క ఇంటికి వచ్చి దాడిలో చనిపోయిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube