టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’..
హిట్ 1 సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా రెడీ అయ్యింది.
ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.ఈ సినిమా సక్సెస్ ఫుల్ అవ్వడంతో మళ్ళీ నాని సీక్వెల్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.
అయితే ఈసారి హీరోగా విశ్వక్ సేన్ కాకుండా అడవి శేష్ ను తీసుకున్నారు.ఇదే ఈ సినిమాకు ఇప్పుడు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.
ఎందుకంటే అడవిశేష్ ఇటీవలే మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.దీంతో ఈయన క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.
డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి.

ముందు నుండి వచ్చిన బజ్ కారణంగా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే యూఎస్ మార్కెట్ లో సాలిడ్ నంబర్స్ నమోదు చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం హిట్ 2 కి ఒక్క యూఎస్ ప్రీమియర్స్ నుండే ఒక లక్ష 50 వేల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా అక్కడి డిస్టిబ్యూషన్ సంస్థ ప్రైమ్ మీడియా వారు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.డే 1 రోజుతో కలిపి సాలిడ్ నెంబర్ అందుకునే అవకాశం ఉంది.
చూడాలి మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.







