ఇదేం GST బాదుడు గురూ.. పెరుగు ప్యాకెట్ పైన కూడా వదలరా వీరు?

ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? మీరు వింటున్నది నిజమే.దేశంలో ద్రవ్యోల్బణం దారుణంగా వున్న పరిస్థితుల్లో ఇంధనంపై పన్ను తగ్గించింది కేంద్రం.

 Gst On Curd Packet-TeluguStop.com

ఆ లోటును చిన్నాచితకా వస్తు, సేవలపై GST బాదుడు రూపంలో ఇపుడు భర్తీ చేయనున్నారు.ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే GST మండలి కీలక ప్రతిపాదనలు చేసింది.

దేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులు చేసేందుకు, మరికొన్నింటికి ఇస్తున్న మినహాయింపులను తొలగించేందుకు GST మండలి తాజాగా ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో జరుగుతున్న 47 GST మండలి 2 రోజుల సమావేశంలో భాగంగా మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.రోజుకు రూ.1000లోపు అద్దె వసూలు చేసే హోటల్‌ వసతికి ప్రస్తుతం ఇస్తున్న GST మినహాయింపును తొలగించాలని నిర్ణయించారు.ఇకనుండి రూ.1000లోపు లభించే హోటల్‌ గదులపై 12% GST వసూలు చేస్తారు.ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5 వేల కన్నా ఎక్కువ అద్దె కలిగిన గది తీసుకుంటే 5% GST కట్టవలసి ఉంటుంది.మరోవైపు పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ లెటర్లు, బుక్‌పోస్ట్‌, ఎన్వలప్‌ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్‌ సేవలపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు.

Telugu Curd, Package, Rates-Latest News - Telugu

అలాగే రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి.మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా.ఇకనుండి ఆయా పదార్థాల మీద కూడా 5% GST వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.

విద్యార్థులు ఇతరులు వాడే మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లపైన కూడా ఇకనుండి 12% GST ఉంటుంది.కాగా, ప్యాకింగ్‌ చేయని, లేబుళ్లు లేని, బ్రాండ్‌ లేని వస్తువులకు GST మినహాయింపు కొనసాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube