ఇదేం GST బాదుడు గురూ.. పెరుగు ప్యాకెట్ పైన కూడా వదలరా వీరు?

ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? మీరు వింటున్నది నిజమే.దేశంలో ద్రవ్యోల్బణం దారుణంగా వున్న పరిస్థితుల్లో ఇంధనంపై పన్ను తగ్గించింది కేంద్రం.

ఆ లోటును చిన్నాచితకా వస్తు, సేవలపై GST బాదుడు రూపంలో ఇపుడు భర్తీ చేయనున్నారు.

ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే GST మండలి కీలక ప్రతిపాదనలు చేసింది.

దేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులు చేసేందుకు, మరికొన్నింటికి ఇస్తున్న మినహాయింపులను తొలగించేందుకు GST మండలి తాజాగా ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో జరుగుతున్న 47 GST మండలి 2 రోజుల సమావేశంలో భాగంగా మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.రోజుకు రూ.

1000లోపు అద్దె వసూలు చేసే హోటల్‌ వసతికి ప్రస్తుతం ఇస్తున్న GST మినహాయింపును తొలగించాలని నిర్ణయించారు.

ఇకనుండి రూ.1000లోపు లభించే హోటల్‌ గదులపై 12% GST వసూలు చేస్తారు.

ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5 వేల కన్నా ఎక్కువ అద్దె కలిగిన గది తీసుకుంటే 5% GST కట్టవలసి ఉంటుంది.

మరోవైపు పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ లెటర్లు, బుక్‌పోస్ట్‌, ఎన్వలప్‌ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్‌ సేవలపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు.

"""/"/ అలాగే రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి.

మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా.

ఇకనుండి ఆయా పదార్థాల మీద కూడా 5% GST వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.

విద్యార్థులు ఇతరులు వాడే మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లపైన కూడా ఇకనుండి 12% GST ఉంటుంది.

కాగా, ప్యాకింగ్‌ చేయని, లేబుళ్లు లేని, బ్రాండ్‌ లేని వస్తువులకు GST మినహాయింపు కొనసాగుతుంది.