తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్లీ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత జంట ఒక్కసారిగా విడాకుల ప్రకటన చేయడంతో అందరూ షాక్ అయ్యారు.ఈ క్రమంలోనే వీరి విడాకుల ప్రస్తావన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇక ఈ విడాకుల ప్రకటన అబద్ధమైతే బాగుండు, తిరిగి వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావించారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇకపై కలుసుకునే సూచనలు లేవని అభిమానులు భావించారు.
ఇలా విడాకులు ప్రకటన తర్వాత కొద్దిరోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సమంత తిరిగి ఆ బాధ నుంచి బయటపడి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత తన సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
అయితే వీరి విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత మొట్టమొదటిసారిగా నాగచైతన్య ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.

అయితే సమంత నాగచైతన్య ఫోటోని షేర్ చేయడంతో కొన్ని క్షణాలపాటు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా సమంత ఉన్నఫలంగా నాగచైతన్య ఫోటోని షేర్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే నాగచైతన్య సమంత జంటగా నటించిన అద్భుతమైన ప్రేమ కావ్యం మజిలీ సినిమా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సమంత ఈ సినిమాకి సంబంధించి నాగచైతన్య పోస్టర్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.సమంత ఇలా నాగచైతన్య ఫోటోని షేర్ చేయడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.