టాలీవుడ్ విశ్వనటుడు కమల్ హాసన్ గారాలపట్టి అయిన శృతిహాసన్ గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.ఇకపోతే శృతిహాసన్ ఇటీవలే కరోనా మహమ్మారి బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం ఇంకా సహకరించడం లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే ప్రస్తుతం శృతి హాసన్ ప్రియుడు తో ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది.
శృతిహాసన్ జంట ఒకరికొకరు చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శృతి హాసన్ తన ప్రియుడితో కలిసి గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చెప్పబోతున్నారు.
ఇక ప్రస్తుతం శృతి హాసన్ తన ప్రియుడు తో కలసి ముంబైలోని ఒక ఇంట్లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నామని, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలిపారు.

శృతిహాసన్ నిత్యం సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అదేవిధంగా ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను, అలాగే సినిమాలకు సంబంధించిన విషయాలను ఇలా ప్రతి ఒక్క అప్ డేట్ ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.
ఇకపోతే శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ఈమె చిరంజీవి నటిస్తున్న మెగా 154 సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.అలాగే శృతిహాసన్ బాలకృష్ణతో కలిసి ఎన్.బి.కె 107 సినిమాలో నటిస్తోంది.బాలకృష్ణ నటిస్తున్న సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.







