అపర కుభేరుడికి వ‌రుస‌ నష్టాలు.. ఒక్క రోజులో 10 వేల కోట్ల న‌ష్టం..

కరోనా కంగారు కొంత మంది వ్యాపారాలకు తీవ్ర నష్టం కలుగజేస్తే కొంత మంది వ్యాపారాలు మాత్రం ఈ కాలంలో ఎవరూ ఊహించని విధంగా వృద్ధిలోకి వచ్చాయి.ఆ వ్యాపారాధిపతులకు వేల కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి.

 Singapore Richest Man Forrest Lee Loss Ten Billion Dollars In One Day Details, F-TeluguStop.com

ఇలా వేల కోట్ల రూపాయలను కరోనా కాలంలో ఆర్జించిన వ్యక్తుల్లో సింగపూర్ కు చెందిన ఫారెస్ట్ లీ ఒకరు.సింగపూర్ గేమింగ్ కంపెనీకి ఓనర్ అయిన లీ కరోనా కాలంలో విపరీతంగా సంపాధించేశారు.దీంతో లీ హవా బాగా పెరిగిపోయింది.ఆయన సింగపూర్ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకారు.కానీ ఈ డబ్బులు లీ వద్ద ఎంతో కాలం నిలవలేదు.ప్రస్తుతం ఆయన కంపెనీకి చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో ఘోరంగా కుప్పకూలడంతో లీ ఆస్తి క్రమంగా ఆవిరవుతూ వస్తోంది.

చైనా గేమింగ్ దిగ్గజం అయిన టెన్సెంట్ లీకి చెందిన సీ కంపెనీ వాటాలో కోత విధించింది.ఈ ఘటనతో లీ ఆస్తి ఒక్క సారిగా కరిగిపోయింది.

గతేడాది అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ జరుగుతుంది.అంతే కాకుండా టెన్సెంట్ స్టాక్ ధరలు కూడా రెండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.

దీంతో లీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.ఈ పరిణామంతో ఫారెస్ట్ లీకి ఈ మూడు నెలల్లో దాదాపు 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని బ్లూమ్ బర్గ్ నివేదించింది.

Telugu Corona, Forest Lee, Forrest Lee, Dollars, Day, Company-Latest News - Telu

10 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 70 వేల కోట్లకుపైమాటే.ఇక లీ ఒక్క మంగళవారం రోజే దాదాపు 1.5 బిలియన్ డాలర్లను నష్టపోయాడు.అంటే మన కరెన్సీలో దాదాపు 10 వేల కోట్ల పైమాటే.

ఈ నష్టాల నుంచి కోలుకోవడం ఫారెస్ట్ లీకి ఇప్పట్లో సాధ్యం కాదని చాలా మంది ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube