టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ పరుశురామ్( Parasuram ).ఇలా ఈ సినిమాలతో దర్శకుడుగా ఎంతో మంచి పేద ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం ఎన్నో బడా నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకుంటూ వచ్చారు.
ఇలా స్టార్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయనకు ఏకంగా మహేష్ బాబుని డైరెక్టర్ చేసే అవకాశం లభించింది.
మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) అనే సినిమా ద్వారా పరుశురాం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయినప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి ఇలా కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురయ్యాయి.ఇక ఈ సినిమా నుంచి అయినా ఈయన కాస్త తన తప్పులు దిద్దుకుంటారు అనుకున్నారు కానీ ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమాతో ఈయన తన కెరీర్ ను పూర్తిగా డామేజ్ చేసుకున్నారని చెప్పాలి.
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా ఫ్యామిలీ సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.లాజిక్ లేని సీన్లు, అర్థరహితమైన డైలాగుల పట్ల తీవ్ర విమర్శలు తప్పలేదు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సినిమా రిలీజయ్యాక ఇంకో రౌండ్ ఈయనని అభిమానులు ఆడుకుంటున్నారని చెప్పాలి.ఇంతకుముందు ఎలాంటి ఫ్లాప్స్ లేనటువంటి ఈయన ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ డామేజ్ చేసుకున్నారని తెలుస్తుంది.
ఇలాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈయనకు తదుపరి సినిమా అవకాశం వస్తుందా అన్న విషయంపై సందిగ్గత నెలకొంది.అయితే హీరో రామ్ తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఈయనతో చేయడానికి రామ్ ఒప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.